![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసరమావుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2 ). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -741 లో..... అందరు కలిసి జ్యోత్స్నతో సూరజ్ పెళ్లి చెయ్యడానికి శివన్నారాయణని ఒప్పించడానికి ట్రై చేస్తారు. మీరు సూరజ్ చాలా నిజాయితీ గా ఉన్నాడని అన్నారు.. నా మనవడిలాంటి వాడు అన్నాడు.. అలాంటప్పుడు మీరు అనాధ అని తెలిసినప్పుటి నుంచి మీలో మార్పు ఎందుకు వచ్చిందని శ్రీధర్ అంటాడు. నేను నా మనవరాలికి గొప్ప సంబంధం తీసుకొని రావాలనుకున్నాను అందుకే సూరజ్ అనాధ అనగానే కొంచెం డిస్సపాయింట్ అయ్యాను. ఇప్పుడు నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నానని శివన్నారాయణ అంటాడు.
దాంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. మీరు నిర్ణయం మార్చుకున్నంత ఈజీగా నేను నా మనసు మార్చుకోలేనని జ్యోత్స్న అంటుంది. ఒక అనాధని పెళ్లి చేసుకోనని జ్యోత్స్న అనగానే సుమిత్ర తనపై కోప్పడుతుంది. ఆ తర్వాత ఇప్పుడు సూరజ్ అనాధ అని నీకు ప్రాబ్లమ్ కదా అయితే సూరజ్ ని నేను దత్తత తీసుకుంటానని శ్రీధర్ అనగానే కాంచన ఒప్పుకుంటుంది. నాకు ఒకే అనీ కార్తీక్ అంటాడు. ఇంకెందుకు బావ ఆలస్యం.. నువ్వు నీ చెల్లి ఇంటికి కోడలుగా నీ కూతురిని పంపించాలనుకున్నావ్ అదే జరుగుతుందని శ్రీధర్ అనగానే దశరత్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. అవసరం అయితే నా ఆస్తిలో వాటా ఇస్తానని శ్రీధర్ అంటాడు. వెంటనే సూరజ్ ని తీసుకొని రమ్మని కార్తీక్ ని పంపిస్తారు. కార్తీక్, దీప, పారిజాతం అవుట్ హౌస్ లోకి వెళ్తారు. అక్కడ సూరజ్ ఉండడు. రూమ్ ఖాళీ చేసి వెళ్లినట్లు వాళ్ళకి అర్థమవుతుంది. అదే విషయం లోపలికి వచ్చి చెప్తారు. మంచి పని చేసాడని జ్యోత్స్న అంటుంది.
ఆ తర్వాత అసలు సూరజ్ ఎక్కడికి వెళ్ళాడని కార్తీక్, దీప అనుకుంటారు. ఆఫీస్ లో సూరజ్ ని చూసి షాక్ అవుతారు. ఏంటి బ్రో చెప్పకుండా వెళ్ళావని కార్తీక్ అడుగుతాడు. నాకు ఇక అక్కడ ఉండాలనిపించలేదు అని సూరజ్ అంటాడు. అప్పుడే శివన్నారాయణ సూరజ్ ని చూసి అక్కడ నుంచి లోపలికి వెళ్తాడు. ఎంత అడిగిన కార్తీక్ వాళ్ళకి సూరజ్ సమాధానం చెప్పడు. అప్పుడే జ్యోత్స్న వస్తుంది. సూరజ్ ని చూసి షాక్ అవుతుంది. వీడు ఆఫీస్ కి ఎందుకు వచ్చాడని జ్యోత్స్న అనుకుంటుంది. ఆ తర్వాత సూరజ్ దగ్గరికి జ్యోత్స్న వచ్చి.. అసలు మళ్ళీ ఎందుకు వచ్చావని కోప్పడుతుంది. ఎంత అడిగినా సూరజ్ తనకి సమాధానం చెప్పకుండా టార్చర్ పెడుతాడు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |